సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జూన్ 2023 (21:55 IST)

రైలు ప్రమాదం.. ఎన్ఓసీసీఐ పార్కులో తాత్కాలిక మార్చురీ ఏర్పాటు

train accident
బాలాసోర్‌లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 300 మంది మరణించారు. 900మందికి పైగా గాయపడ్డారు. ఒడిశా ప్రభుత్వం శనివారం నగర శివార్లలోని నార్త్ ఒరిస్సా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎన్ఓసీసీఐ) వ్యాపార పార్కులో తాత్కాలిక మార్చురీని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
 
ఎన్ఓసీసీఐకి చెదిన 40,000 చదరపు అడుగుల ఎక్స్‌పో హాల్‌ను గుర్తు తెలియని మృతదేహాలను భద్రపరిచే మార్చురీగా మార్చినట్లు అధికారి తెలిపారు. ఈ ప్రదేశం బాలాసోర్ జిల్లాలోని బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాద స్థలానికి దాదాపు 15 కి.మీ. దూరంలో వుంది.