గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (16:00 IST)

232 రోజుల తర్వాత గృహనిర్బంధం నుంచి ఒమర్ అబ్దుల్లాకు విముక్తి

జమ్మూకాశ్మీర్‌కు కల్పిస్తూ వచ్చిన స్వయంప్రతిపత్తిని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం రద్దుచేసింది. అలాగే, ఎప్పటినుంచో అమల్లో ఉన్న ఆర్టికల్ 370ని కూడా తొలగించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి కాశ్మీర్ నేతలందరినీ గృహ నిర్బంధంలోకి ఉంచింది. అలాంటి వారిలో జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఒకరు. 
 
తాజాగా ఆయనపై నిర్బంధాన్ని ఎత్తివేస్తూ కేంద్రం ప్రకటన చేసింది. దాంతో ఆయనను విడుదల చేశారు. గత ఎనిమిది నెలలుగా అంటే 232 రోజులుగా ఆయన గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆయనపై ఉన్న గృహనిర్బంధం ఎత్తివేయడంతో మంగళవారం హరినివాస్ నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత ఆయన నేరుగా తన తండ్రి ఫరూక్ అబ్దుల్లా నివాసానికి వెళ్లితో తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న భోజనం ఆరగించారు.
 
కాగా, ఒమర్ అబ్దుల్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి అయిన ఫరూక్ అబ్దుల్లాను కేంద్రం నిర్బంధం నుంచి విడుదల చేసింది. తాజాగా ఓ ప్రకటనలో ఒమర్ అబ్దుల్లాపై నిర్బంధాన్ని పూర్తిస్థాయిలో ఎత్తివేస్తున్నట్టు జమ్మూకశ్మీర్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ప్రణాళిక విభాగం) రోహిత్ కన్సాల్ వెల్లడించారు. ఆ తర్వాత హరినివాస్ నుంచి ఒమర్ అబ్దుల్లా రిలీజ్ అయ్యారు.