మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (21:04 IST)

కర్ణాటకలో విషాహారం తిని 20 కోతులు మృతి

కర్ణాటకలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. విషాహారం ఇవ్వడంతో 20కిపైగా కోతులు మృతి చెందాయి. వాటిని గోనె సంచుల్లో కుక్కి కోలార్ హైవే సమీపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. స్థానికుల సమాచారం మేరకు కోతులను అటవీ శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. విషమిచ్చి వాటిని చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. 
 
కోతుల మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటామని కోలార్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్ సెల్వమణి తెలిపారు. కాగా గతంలో కూడా కర్ణాటకలో ఇటువంటి ఘటన చోటుచేసుకుంది.