Pahalgam terror attack LIVE: 28మంది మృతి.. మృతుల్లో విదేశీయులు (video)
జమ్మూ కాశ్మీర్‌కు ఉగ్రభయం పట్టుకుంది. పర్యాటకులతో నిండిన పహల్గామ్ వద్ద ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రాథమిక సమాచారం. మృతుల్లో కొందరు విదేశీయులున్నారని సమాచారం.
పర్యాటకులు ప్రశాంతంగా ఉన్న సమయంలో అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. దీంతో అక్కడ ఉన్నవారంతా భయంతో పరుగులు తీశారు. కొంత మంది అక్కడికక్కడే మృతి చెందారు. వారు వేసవి సెలవుల కోసం పహల్గామ్‌ను సందర్శించారని సమాచారం.
ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ ఘటన దేశీయంగా కాదు, అంతర్జాతీయంగా కూడా కాశ్మీర్‌లో భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఈ దాడికి స్పందనగా భద్రతా బలగాలు పెద్ద ఎత్తున కాశ్మీర్‌లో మోహరించబడ్డాయి.
ఈ దాడిపై సోషల్ మీడియాలో స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ దాడిని ఖండించారు. ఈ ఘటనపై కేంద్రం సీరియస్ అయ్యింది. సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఫోన్ చేశారు. ఉగ్రదాడిపై ఆరా తీశారు.
అమిత్‌షాను పహల్‌గామ్‌కు వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రధాని మోదీ సూచనలతో అమిత్ షా అత్యున్నత సమావేశానికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం అమిత్ షా జమ్మూకి బయల్దేరి వెళ్లారు.