గురువారం, 20 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (12:26 IST)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

lemon leaves
దేశంలోని ప్రసిద్ధ ఆలయాల్లో పళని మురుగన్ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో పళని ఏటా మూడు రోజులపాటు తైపూస ఉత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకల సందర్భంగా స్వామివారి పాదాల చెంత నిమ్మకాయలు ఉంచుతారు. ఈ నిమ్మకాయలను సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీపడుతున్నారు. ఈ వేలం పాటల్లో ఒక్క నిమ్మకాయను రూ.5 లక్షల ధర చెల్లించి దక్కించుకున్నారు. 
 
తాజాగా నిర్వహించిన ఈ వేలం పాటల్లో పుదుక్కోటై జిల్లా తిరుమంగళం వల్లనాట్టు చెట్టియార్ వర్గీయులు పళనిలో ఏటా మూజు రోజుల పాటు తైపూస వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అన్నదానం కూడా చేస్తారు. ఈ క్రమంలో స్వామి పాదాల వద్ద ఒక్కో నిమ్మకాయ పెట్టి పూజ చేస్తుంటారు. 
 
తాజాగా వాటిని వేలం వేయగా ఒక్కో నిమ్మకాయ రూ.16 వేల నుంచి రూ.40 వేల వరకు ధర పలికింది. తైపూసం రోజున మురుగన్ అభిషేకం సమయంలో స్వామివారి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయను మాత్రం ఓ భక్తుడు రూ.5.09 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఈ వేలం వల్లనాట్లు చెట్టియార్ మాత్రమే పాల్గొంటారు. స్వామి వారి పాదాల వద్ద ఉంచిన నిమ్మకాయ తమ వద్దే ఉంటే శుభం జరుగుతుదని భక్తులు విశ్వాసం. అందుకే పూజలో పెట్టే నిమ్మకాయలను సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీపడుతుంటారు.