బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మార్చి 2021 (16:31 IST)

కుమార్తెను వేధిస్తున్నాడని వార్నింగ్ ఇచ్చింది.. అంతే కాల్చేశాడు..

మహిళలపై వేధింపులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మహిళలపై దాడికి పాల్పడే వారిపై కఠినమైన శిక్ష విధించేందుకు నిర్భయ, దిశలాంటి చట్టాలొచ్చినా ప్రయోజనం లేదనే చెప్పాలి. తాజాగా తన కుమార్తె (15)ను వేధిస్తున్న యువకుడిని మందలించినందుకు మహిళ(40)ను యువకుడు కాల్చిచంపిన ఘటన బీహార్‌ రాజధాని పట్నాకు సమీపంలోని జగ్గుబిఘ గ్రామంలో వెలుగుచూసింది. 
 
బాధితురాలిని నీలం దేవిగా గుర్తించారు పోలీసులు. పదిరోజుల కిందట తన కుమార్తెను చందన్‌ యాదవ్‌ (25) అనే యువకుడు వేధించడంతో అతడిని నీలం వారించింది. యాదవ్‌ సహా అతని కుటుంబ సభ్యులతోనూ నీలం వాగ్వాదానికి దిగింది.
 
కుమార్తెను వేధిస్తుండటంపై నీలం భర్త లల్లాన్‌ యాదవ్‌, చందన్‌ యాదవ్‌ల మధ్య మరోసారి ఘర్షణ చెలరేగింది. బుధవారం ఉదయం సైతం ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో చందన్‌, అతడి స్నేహితులు నీలం కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 
 
చందన్‌ కాల్పుల్లో నీలం ప్రాణాలు కోల్పోయింది. బాధితురాలి భర్త ఫిర్యాదుపై చందన్‌, కుందన్‌ సహా 16 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకూ ఒకరిని అరెస్ట్‌ చేశారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేపటట్టామని పోలీసులు తెలిపారు.