సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 జులై 2021 (12:59 IST)

పెగాసస్ స్పైవేర్ ఎఫెక్ట్: మొబైల్ ఫోన్లు వద్దు.. ల్యాండ్ లైన్ ఫోన్లు వాడండి..

ప్రభుత్వోగులు ఆఫీస్ సమయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పని వేళల్లో ప్రభుత్వోగులు సాధ్యమైనంత మేరకు మొబైల్ ఫోన్ల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించింది. అత్యవసరమనుకుంటే ల్యాండ్ లైన్ ఫోన్లను వినియోగించాలని సూచించింది. దేశ వ్యాప్తంగా పెగాసస్ స్పైవేర్ దుమారం సృష్టిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. 
 
అధికారిక పనుల నిమిత్తం అత్యవసరమైతే మాత్రమే మొబైల్ ఫోన్లు వినియోగించాలని ఉద్యోగులకు సూచించింది. ప్రభుత్వోగులు విచ్ఛలవిడిగా మొబైల్ ఫోన్ల వాడటం ద్వారా ప్రభుత్వ ఇమేజ్‌ దెబ్బతినే అవకాశమున్నట్లు పేర్కొంది. అయితే ఈ అధికారిక ఉత్తర్వుల్లో ఎక్కడా నేరుగా పెగాసస్ స్పైవేర్ గురించి నేరుగా ప్రస్తావించలేదు.
 
మొబైల్ ఫోన్లు వినియోగించాల్సి వస్తే..ఎక్కువగా టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా చేసుకోవాలని ఆ ఆదేశాల్లో సూచించింది. అలాగే పనివేళల్లో మొబైల్ ఫోన్లలో సోషల్ మీడియా వినియోగాన్ని కూడా వీలైనంత తగ్గించుకోవాలని సూచించింది. ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక మొబైల్ ఫోన్స్‌లో వ్యక్తిగత కాల్స్ చేసుకోవాలని..ప్రభుత్వోగుల మొబైల్ ఫోన్ వినియోగంపై 'కోడ్ ఆఫ్ కండక్ట్' పేరిట జారీ చేసిన ఉత్తర్వులు పేర్కొంది. 
 
పరిసర ప్రాంతాల్లో ఇతరులు ఉండే అవకాశమున్నందున మొబైల్ ఫోన్లలో గౌరవప్రదంగా మాట్లాడాలని…తక్కువ వాయిస్‌తో మొబైల్ ఫోన్లలో ఇతరులతో మాట్లాడాలని సూచించింది. అదే సమయంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారుల నుంచి వచ్చే కాల్స్‌ను జాప్యం చేయకుండా తక్షణమే రిసీవ్ చేసుకోవాలని స్పష్టంచేసింది.