శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (08:35 IST)

రేపటి నుంచి షిర్డీ సాయిబాబా దర్శనానికి అనుమతి

ఎన్నో రోజులుగా షిర్డీ వెళ్లాలనుకుని.. ఎదురుచూసే బాబా భక్తులకు ఇది తీపి కబురు. కరోనా కారణంగా మూసివేసిన షిర్డీ ఆలయం మళ్లీ తెరుచుకోనుంది. నవరాత్రుల తొలిరోజైన అక్టోబర్ 7 నుంచి షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తులకు అనుమతించాలని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌టీ) నిర్ణయించింది.

ఈ మేరకు పలు నియమ నిబంధనలు పాటిస్తూ సాయిబాబాను దర్శించుకోవచ్చని ఎస్‌ఎస్‌ఎస్‌టీ పేర్కొంది. అవేంటంటే...

* అక్టోబరు7 (గురువారం) నుంచి ప్రతిరోజూ 15 వేల భక్తులకు మాత్రమే సాయి దర్శనం లభిస్తుంది. ఇందులో 5 వేల వరకు పెయిడ్ పాసులు, 5 వేల ఆన్‌లైన్ పాసులు, 5 వేల ఆఫ్ లైన్ పాసులు ఉంటాయి. గంటకు దాదాపు 1,150 మంది షిర్డీ సాయినాథుడిని దర్శించుకోవచ్చు.

*  భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది.
*  అదే విధంగా.. హారతి సేవకు కేవలం 90 మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు.
*  గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారిని ఆలయంలోకి అనుమతించరు.
* 2020 మార్చి 17న కరోనా లాక్‌డౌన్ కారణంగా మూతబడ్డ సాయిబాబా ఆలయం.. తొమ్మిది నెలల తరువాత నవంబర్ 16న తిరిగి తెరిచారు. అప్పట్లో రోజుకు 6000 మందికి దర్శనం కల్పించారు.

* ఆపై ఆ సంఖ్యను 14 వేల నుంచి 20 వేలకు పెంచారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 5 తరువాత కరోనా కేసుల పెరుగుదల కారణంగా సాయిబాబు ఆలయాన్ని మరోసారి మూసేశారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. దాదాపు ఏడు నెలల తరువాత ఆలయాన్ని తెరుస్తున్నారు.