శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 19 సెప్టెంబరు 2020 (10:36 IST)

21 నుంచి తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి

కరోనా సంక్షోభంలో సప్టెంబరు 21 వతేదీ నుంచి తాజ్ మహల్, ఆగ్రా కోటలను సందర్శించేందుకు పర్యాటకులను అనుమతించాలని కేంద్ర పురావస్తు శాఖ నిర్ణయించింది. దీంతో పర్యాటకుల రాక కోసం ఆగ్రా నగరంలోని హోటళ్లను శానిటైజ్ చేసి సిద్ధం చేస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్త లాక్ డౌన్ వల్ల గత ఐదునెలలుగా తాజ్ మహల్‌ను మూసివేశారు. దీంతో ఆగ్రా నగరంలోని హోటళ్లు కూడా మూతపడటంతో యజమానులు తీవ్ర నష్టాల పాలయ్యారు. తాజ్ మహల్, ఆగ్రాకోటలను సందర్శకుల కోసం తెరవనున్నందున పర్యాటకులకు హోటల్ యజమానులు స్వాగతం చెప్పారు.

ఈ నెల 21 నుంచి  తాజ్ మహల్‌లో సందర్శకులను అనుమతించేందుకు ఆగ్రా జిల్లా కలెక్టరు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆగ్రా పర్యాటక రంగం ఊపందుకోనుంది. చారిత్రాత్మక తాజ్‌మహల్‌ను సందర్శించాలనుకునే పర్యాటకులకు ఇది నిజంగా శుభవార్తే.