శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 ఏప్రియల్ 2023 (15:05 IST)

నన్ను క్షమించండి అంటూ స్టేటస్.. IIT మద్రాస్‌లో PHD విద్యార్థి ఆత్మహత్య

suicide
ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సచిన్‌ కుమార్‌ జైన్‌(32) యధావిధిగా గిండీ క్యాంపస్‌లో తరగతులకు హాజరయ్యాడు. స్థానికంగా అద్దెకు వుంటూ.. ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్డీ చేస్తున్నాడు. శుక్రవారం ఎవరికీ చెప్పకుండా అతడు తన గదికి వచ్చేశాడు. 
 
గంటసేపైనా జైన్‌ క్లాసుకు తిరిగిరాకపోవడాన్ని గమనించిన స్నేహితులు అతడి గదికి వెళ్లి చూశారు. అక్కడ సచిన్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అత్యవసర సహాయక బృందం అతడు అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. 
 
ఆత్మహత్యకు ముందు సచిన్‌ కుమార్‌ జైన్‌, వాట్సాప్‌లో 'నన్ను క్షమించండి, ఇది సరిపోదు' అని స్టేటస్‌ పెట్టాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపనున్నట్లు పోలీసులు చెప్పారు.