శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 1 ఆగస్టు 2022 (22:46 IST)

నాలుగేళ్ల బీఎస్ డిగ్రీ ఆప్షన్‌తో ప్రోగ్రామింగ్- డేటా సైన్స్‌లో ఐఐటీ మద్రాస్ వారి బీఎస్‌సీ ప్రోగ్రాం

IIT Madras
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ (ఐఐటీ మద్రాస్) వారి బీఎస్‌సీ ఇన్ ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ దేశవ్యాప్తంగా విద్యార్థులు నుండి వచ్చిన తీవ్రమైన డిమాండ్ వలన ఇప్పుడు డేటా సైన్స్ మరియు అప్లికేషన్స్‌లో నాలుగు సంవత్సరాల బీఎస్ డిగ్రీతో అందుబాటులోకి వచ్చింది. బీఎస్ స్థాయిలో భాగంగా, విద్యార్థులు 8 నెలల అప్రెంటీస్‌షిప్‌ను లేదా కంపెనీస్ లేదా పరిశోధనా సంస్థలతో ప్రాజెక్టును చేయవచ్చు.

 
విద్యార్థులకు పలు ప్రవేశ మరియు నిష్క్రమణ ఆప్షన్స్‌ని అందించడానికి ఈ విలక్షణమైన ప్రోగ్రాం జాగ్రత్తగా రూపొందించబడింది. నేర్చుకునే వారు దీనిలో సర్టిఫికెట్, డిప్లొమా లేదా డిగ్రీ సంపాదించవచ్చు. ఇది నేర్చుకునే వారికి సౌలభ్యంగా ఉంటుంది మరియు ఈ ప్రోగ్రాం ద్వారా తాము సాధించాలని కోరుకున్నది వారు ఎంచుకునే అవకాశం ఇస్తుంది. 12 వ తరగతిలో ఉన్న విద్యార్థులు కూడా ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసి అడ్మిషన్ పొందవచ్చు. ప్రవేశాలు పొందిన విద్యార్థులు తమ 12 వ తరగతిని విజయవంతంగా పూర్తి చేసిన తరువాత ప్రోగ్రాంను ఆరంభిస్తారు. ఏ స్ట్రీమ్ కు చెందిన విద్యార్థులైనా నమోదు చేయవచ్చు. వయస్సు పరిమితి లేదు. 10వ తరగతిలో ఇంగ్లిష్ మరియు గణితం చదివిన ఎవరైనా దరఖాస్తు చేయడానికి అర్హులు. తరగతులు ఆన్‌లైన్ లో నిర్వహించబడతాయి కాబట్టి, ప్రాంతాలతో సంబంధం లేదు.

 
ప్రస్తుతం, 13,000 మందికి పైగా విద్యార్థులు ప్రోగ్రాంలో నమోదయ్యారు. తమిళ నాడు నుండి అత్యధిక సంఖ్యలో విద్యార్థులు నమోదు అవగా తదుపరి స్థానాలను మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశాలు ఆక్రమించాయి. భారతదేశంలో 111 పట్టణాలలో వ్యక్తిగత పరీక్షలు (ఇన్-పర్సన్ పరీక్షలు) 116 పరీక్షా కేంద్రాలలో నిర్వహించబడ్డాయి. పరీక్షా కేంద్రాలు యూ.ఏ.ఈ., బహ్రైన్, కువైట్ మరియు శ్రీ లంకలలో కూడా తెరవబడ్డాయి. 2022 సెప్టెంబర్ టెర్మ్ కోసం ఈ డేటా సైన్స్ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ 19 ఆగస్ట్ 2022. ఆసక్తి గల విద్యార్థులు వెబ్‌సైట్ - onlinedegree.iitm.ac.in ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

 
ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ, ప్రొఫెసర్ వి. కామకోటి, డైరక్టర్, ఐఐటీ మద్రాస్, ఇలా అన్నారు, "ఐఐటీ మద్రాస్ డేటా సైన్స్ మరియు అప్లికేషన్స్ లో ఈ బాగా రూపొందించబడిన, సమకాలీన బీఎస్ ను ఆనందంగా అందిస్తోంది, ఇది దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు సమీకృత విధానంలో ఐఐటీ నాణ్యతా విద్యను అందిస్తుంది. డేటా సైన్స్ అభివృద్ధి చెందుతున్న అంశాలలో ఒకటి. నైపుణ్యం గల వనరులు కోసం అత్యధికంగా డిమాండ్ గల డొమైన్ లో అత్యధికంగా ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాం ఇది."

 
డేటాను నిర్వహించడం, మేనేజీరియల్ అభిప్రాయాలు పొందడానికి నమూనాలు ఊహించడం, మోడల్ అనిశ్చితాలు, సమర్థవంతమైన వ్యాపార నిర్ణయాలు చేయడానికి ముందస్తుగా అంశాలను ఊహించడంలో సహాయపడే మోడల్స్ రూపొందించడాన్ని డేటా సైన్స్ విద్యార్థులకు బోధిస్తుంది. విస్త్రతంగా ఆచరణాత్మకమైన శిక్షణ మరియు అనుభవపూర్వకంగా నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు పరిశ్రమలో ప్రామాణాలను కలిగి ఉండటంలో బాగా శిక్షణ పొందుతారు. డిప్లొమా స్థాయి ప్రోగ్రాంను పూర్తి చేసిన విద్యార్థులు కోసం ఐఐటీ మద్రాస్ ఇంటర్న్‌షిప్స్ మరియు ప్లేస్‌మెంట్స్ ను కూడా సమన్వయం చేస్తుంది.

 
ఈ కొత్తచొరవకు గల కారణాలను వివరిస్తూ, ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్, ప్రొఫెసర్ ఇన్-ఛార్జ్, బీఎస్ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఐఐటీ మద్రాస్ ఇలా అన్నారు, "డేటా సైన్స్ బహు విభాగాల డొమైన్ అవడం వలన, ఐఐటీ మద్రాస్ నుండి ఈ బీఎస్ డిగ్రీ అన్ని నేపధ్యాలకు చెందిన విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. కామర్స్ లేదా హ్యుమానిటీస్ చదువుతున్న విద్యార్థులు కూడా ఐఐటీ మద్రాస్ నుండి డిగ్రీ సంపాదించవచ్చు. కంటెంట్ ఆన్‌లైన్ లో అందించబడుతుంది మరియు వ్యక్తిగత పరీక్షలు ఆదివారాలలో నిర్వహించబడతాయి కాబట్టి ఆన్-క్యాంపస్ డిగ్రీకి హాజరవుతూ లేదా ఫుల్-టైమ్ పని చేస్తూ కూడా ఈ డిగ్రీని కొనసాగించవచ్చు."

 
ఈ విలక్షణమైన ప్రోగ్రాం ఎంతో పోటీయుతమైన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) కోసం ప్రయత్నించకుండానే ఐఐటీ మద్రాస్ నుండి చదవడానికి విద్యార్థులకు అవకాశం ఇస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు మరియు జేఈఈ కోచింగ్ తరగతులకు హాజరవడం ఎంతో కష్టమైన ఆర్థికంగా వెనకబడిన నేపధ్యాలకు చెందిన వారికి నేరుగా ప్రయోజనం కలిగిస్తుంది. ఆర్థికంగా అవసరమున్న అర్హులైన విద్యార్థులు కోసం ప్రోగ్రాం 100% వరకు  ఉపకారవేతనాలు అందిస్తుంది.

 
ఇంకా, డా. విగ్నేష్ ముతువిజయన్, ప్రొఫెసర్ ఇన్-ఛార్జ్, బీఎస్ ఇన్ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఐఐటీ మద్రాస్ ఇలా అన్నారు, " బీఎస్ ప్రోగ్రాంలో అడ్మిషన్ కోసం జేఈఈలో అర్హులు అవనవసరం లేదు. ఏదైనా ఇతర ప్రవేశ పరీక్ష వలే కాకుండా, ఈ ప్రోగ్రాం కోసం అర్హత ప్రక్రియ ఎంతో సమీకృతంగా ఉంటుంది. ఆధునిక బోధనా విధానం ఐఐటీ మద్రాస్ నంబర్స్ పై ఎలాంటి నిబంధనలు లేకుండా అర్హులైన అభ్యర్థులు అందర్నీ చేర్చుకోవడానికి వీలు కల్పించింది. ఎన్నో ఉపకారవేతనాలతో ఐఐటీ మద్రాస్ దేశంలోనే అత్యంత సమీకృత మోడల్స్ లో ఒకటి రూపొందించింది."

 
డేటాతో నడిచే ప్రపంచంలో నైపుణ్యమున్న మరియు ఉద్యోగాలు ఇవ్వదగిన ప్రొఫెషనల్స్ ను తయారు చేయడానికి ఐఐటీ మద్రాస్ బీఎస్ ప్రోగ్రాం వేదికగా మారుతుంది. ఈ సమీకృత మరియు సరసమైన విద్యా నమూనా ఐఐటీ విస్త్రతంగా అందరికీ అందుబాటులోకి వస్తుందని మరియు ఉన్నతమైన నాణ్యత గల విద్యను పొందవలసిన అవసరమున్న విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తుందని ఐఐటీ మద్రాస్ బృందం ఆశాభావం వ్యక్తం చేసింది.