సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (16:19 IST)

ద్వారక నగరం మునిగిన ప్రాంతంలో ప్రధాని మోడీ సాహసం...

narendra modi
శ్రీకృష్ణుడు జన్మస్థావరంగా చెప్పుకునే ద్వారకం నగరం మునిగిన ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సాహసం చేశారు. ద్వారాక వద్ద అతిపెద్ద కేబుల్ వంతెనను ప్రారంభించిన ఆయన.. ఆ తర్వాత ఆక్సిజన్ మాస్క్ ధరించి సముద్రంలోకి దిగారు. పిమ్మట ద్వారకాధీస్ ఆలయంలోని శ్రీకృష్ణుడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. 
 
ఆదివారం గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక వద్ద అతిపెద్ద ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి సుదర్శన వంతెనను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత నీట మునిగిన పౌరాణిక ప్రాశస్త్య నగరం ద్వారకను సందర్శించేందుకు ప్రధాని మోడీ ఆక్సిజన్ మాస్కులు ధరించి సముద్ర జలాల్లోకి దిగాు. దీనీపై ఆయన ట్వీట్ చేశారు. 
 
"అగాధ జలాల్లో మునిగివున్న ద్వారకా నగరిలో ప్రార్థనలు జరిపేందుకు వెళ్ళడం ఒక దివ్యమైన అనుభూతిని కలిగించింది. ప్రాచీల కాలం నాటి ఆధ్యాత్మిక వైభవానికి, కాలాతీత భక్తిభావానికి నేను అనుసంధానించబడ్డానన్న భావన కలిగింది. భగవాన్ శ్రీకృష్ణుడి దీవెనలు అందరికీ లభించుగాక" అంటూ ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ మేరరకు తన పర్యటన ఫోటోలను ఆయన షేర్ చేశారు.