మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (18:16 IST)

ఢిల్లీలో పీఎం గతిశక్తి ప్రారంభం.. జల ప్రయాణ సమయాన్ని..?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఢిల్లీలో పీఎం గతిశక్తి-నేషనల్ మాస్టర్ ప్లాన్ మల్టీ మోడల్ కనెక్టివిటీ ప్లాన్‌ను ప్రారంభించారు. ప్రగతి మైదాన్‎లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతిశక్తి అనేది నెక్స్ట్ జనరేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని నిర్మించడానికి ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. దీని ద్వారా ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ మరింత అభివృద్ధి చెందుతాయని మోడీ అన్నారు. 
 
మల్టీ మోడల్ కనెక్టివిటీ ద్వారా ప్రజలు, వస్తువులు మరియు సేవలు ఒక రవాణా విధానం నుంచి మరొక విధానానికి అనుసంధానించబడతారని మోడీ చెప్పారు. ఈ కనెక్టివిటీ దూరంగా తగ్గించడమే కాకుండా.. ప్రజల ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుందని మోడీ అన్నారు. 
 
దేశంలో మౌలికవసతుల కల్పన.. చాలా పార్టీల మెనిఫెస్టోలకు దూరంగా ఉండిపోయిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యతనిచ్చామని ఆయన అన్నారు. 
 
నాణ్యమైన వసతులతోనే దేశాభివృద్ధి, ఉపాధి కల్పన సాధ్యమని.. అది తాము గుర్తించామని మోడీ చెప్పారు. గతంలో ఏదైనా ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తే ఎప్పుడు పూర్తయ్యేవో తెలిసేది కాదని.. ఇప్పుడు ఒక నిర్ణీత కాలపరిమితిలోనే పనులు పూర్తి చేస్తున్నామని ప్రధాని అన్నారు.