సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2023 (15:29 IST)

"యశోభూమి"ని ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ

India International Convention
India International Convention
దేశ రాజధాని ఢిల్లీలో భారీ కట్టడం నిర్మితం అవుతోంది. అత్యాధునిక పరిజ్ఞానం, అద్భుతమైన వసతులతో నిర్మించిన "యశోభూమి"ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఈ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసీసీ)కు ప్రధాని యశోభూమిగా నామకరణం చేసింది. 
 
యశోభూమిలో ప్రధాన ఆడిటోరియంతో పాటు మొత్తం 15 కన్వెన్షన్ హాల్స్, ఓ బాల్ రూమ్, మరో 13 మీటింగ్ రూమ్‌లు ఉన్నాయి. ఈ గదులు అన్నింటిలో మొత్తం 11 వేలమంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో ప్రధాన ఆడిటోరియంలోనే ఆరు వేలమంది కూర్చోవచ్చు. బాల్‌రూమ్‌లో 2,500 మందికి ఆతిథ్యం ఇవ్వొచ్చు.