సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (18:45 IST)

కాంగ్రెస్‌కు ప్రశాంత్ కిశోర్ సలహా.. 370 నుంచి 400 గెలవాలి.. పొత్తు పెట్టుకోవాల్సిందే..

prashanth kishore
కాంగ్రెస్‌కు ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నచోట్ల ఇతర పార్టీలతో వ్యూహాత్మకంగా పొత్తు పెట్టుకోవాలని తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకోవాలని కాంగ్రెస్‌కు ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సలహా ఇచ్చారు.
 
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, అంబికా సోనీ, అజయ్ మాకెన్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రశాంత్ కిశోర్ ఓ ప్రజంటేషన్‌ను సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ప్రశాంత్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కూడా ఉందని చెప్తున్నాయి. 2024 ఎన్నికల కోసం అన్నీ సిద్ధం చేసుకోవాలని ప్రశాంత్ కాంగ్రెస్‌కు సూచించినట్లు తెలిపారు. 
 
2024 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశాలో కాంగ్రెస్ ఒంటరిగా పోరాడాలని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో పొత్తులు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ సూచించారని, ఇందుకు రాహుల్ గాంధీ అంగీకరించారని వార్తలు వస్తున్నాయి.