మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

ఉల్లి ధరల తగ్గింపుకు సన్నాహాలు

దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఉల్లిపాయల కొరతను అధిగమించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నెలాఖరు కల్లా 2 వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నేతృత్వంలోని ఎంఎంటీసీ కంపెనీ టెండర్లు కూడా ఆహ్వానించింది. ఉల్లి కొరత తీవ్రంగా ఉండడంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లిధర కిలో రూ.80 వరకు పలుకుతోంది.

పండుగల సీజన్ కావడంతో పాటు ఈ నెల చివరి వారంలో మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలోని పలు చోట్ల ఉపఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఉల్లి ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవడం గమనార్హం.