శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

జర్మనీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

pmmodi
రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోడీ జర్మనీ దేశానికి చేరుకున్నారు. ఆయనకు మ్యునిక్​లోని ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆది, సోమవారాల్లో జరిగే జీ-7 శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఆహ్వానం మేరకు ఈ సదస్సుకు మోడీ హాజరవుతున్నారు.
 
ప్రపంచవ్యాప్తంగా మానవత్వాన్ని ప్రభావితం చేస్తున్న కీలక అంశాలపై అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్‌ సహా అర్జెంటీనా, ఇండోనేసియా, సెనెగల్‌, దక్షిణాఫ్రికా తదితర ప్రజాస్వామ్య దేశాలను సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న జర్మనీ ఆహ్వానించిందని శనివారం ఓ ప్రకటనలో మోడీ తెలిపారు.
 
సదస్సులో పాల్గొనే జీ-7, భాగస్వామ్య దేశాలు, అంతర్జాతీయ సంస్థలతో పర్యావరణం, విద్యుత్తు, ఆహార భద్రత, ఆరోగ్యం, ఉగ్రవాదం, లింగ సమానత్వం, ప్రజాస్వామ్యం తదితర అంశాలపై చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. షోల్జ్‌ సహా సదస్సులో పాల్గొంటున్న పలు దేశాల నేతలతో ప్రత్యేక భేటీలకు తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.