శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (13:45 IST)

సామాజిక న్యాయం కోసమే ఓబీసీ రిజర్వేషన్లు : ప్రధాని నరేంద్ర మోడీ

సామాజిక న్యాయం కోసంమే అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. ఓబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రధాని మోడీ సర్కారు లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఈ బిల్లు బుధవారం రాజ్యసభకు వచ్చింది. అయితే, ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు.
 
ఇదిలావుంటే, మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని మాట్లాడుతూ, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల్లోని పేదలకు సామాజిక న్యాయం దక్కాలన్న ఉద్దేశ్యంతోనే ఈ బిల్లును తీసుకొచ్చినట్టు తెలిపారు.
 
ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలుపగా, రాజ్యసభలోనూ ఆమోదం పొందుతున్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. అన్యాయం జ‌రిగింద‌న్న భావ‌న పోతుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తంచేశారు. అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు కావాలన్నారు.
 
ఈబీసీ బిల్లు ప్ర‌కారం.. పేద అగ్ర‌కుల‌స్థుల‌కు జ‌న‌ర‌ల్ క్యాట‌గిరీలో 10 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌నున్నారు. రాజ్య‌స‌భ‌ను ఒక రోజు పొడిగించామ‌ని, బ‌హుశా బిల్లును పాస్ చేస్తార‌ని ఆశిస్తున్నాను, ప్ర‌జ‌ల ఆశ‌యాల‌ను గౌర‌విస్తార‌ని భావిస్తున్నాన‌ని, సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని స‌భ్యులు ఈబీసీ బిల్లుకు ఆమోదం తెలుపుతార‌ని ఆశిస్తున్న‌ట్లు ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.