శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 నవంబరు 2023 (18:40 IST)

ఆ పాటకు చప్పట్లు కొడుతూ కార్యకర్తల్లో జోష్ నింపిన ప్రియాంక

priyanka gandhi
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాటకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ స్టెప్పులేసి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. జహీరాబాద్‌లో కార్నర్ మీటింగ్.. రోడ్డు షోలో "మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదలినాడు" అనే పాట వేశారు. 
 
ఈ సమయంలో ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలు చప్పట్లు కొడుతూ ఆ పాటకు స్టెప్పులేసి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. అంతకుముందు ప్రియాంకగాంధీ మాట్లాడుతూ… దొరల తెలంగాణ కావాలా.. ప్రజల తెలంగాణ కావాలా? ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. 
 
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తారని.. కానీ తెలంగాణలో మాత్రం అన్నిచోట్ల పోటీ చేయడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.