బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 మే 2022 (15:49 IST)

ప్రధానికి రక్తంతో లెటర్.. అన్యాయం జరిగితే నక్సల్స్‌లో చేరుతాం

narendra modi
ప్రధాని మోదీకి రక్తంతో లెటర్ అందింది. కర్ణాటకలో ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ పలువురు అభ్యర్థులు ప్రధాని నరేంద్ర మోదీకి రక్తంతో ఉత్తరం రాశారు. 
 
రాష్ట్రంలో జరిగిన ఎస్సై పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయని.. దీనిపై సమగ్రంగా విచారించాలని, అక్రమాలకు పాల్పడిని వారిని శిక్షించాలని అందులో డిమాండ్ చేశారు. 
 
అంతేకాదు.. ఉద్యోగాల్లో తమకు అన్యాయం జరిగితే నక్సల్స్‌ చేరుతామని కూడా ఆ లేఖలో హెచ్చరించారు. మొత్తం ఎనిమిది మంది లేఖ రాశామని అందులో పేర్కొన్నప్పటికీ, వారి పేర్లు కాని, పోన్ నెంబర్లు కానీ లేకుండా జాగ్రత్త పడ్డారు. 
 
అక్రమ మార్గంలో ఎస్సై పోస్టుకు ఎంపిక కావాలనుకున్న వారి వల్ల కష్టపడి చదివి, పరీక్షల్లో ఎంపికైన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని చెప్పారు.
 
అయితే అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని ఆ లేఖలో అభ్యర్థులు కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తమకు అపారమైన గౌరవం ఉందని, దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.