మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (09:43 IST)

ఇంట్లోనే గర్భస్రావం వికటించింది.. పూణే మహిళ మృతి.. ఆడబిడ్డని తెలిసి..?

Pregnant Woman
పూణె జిల్లాలోని తన ఇంట్లో ఆడ పిండాన్ని గర్భస్రావం చేసే ప్రక్రియలో 24 ఏళ్ల మహిళ మరణించింది. ఈ ఘటనలో ఆమె భర్త, అతని తండ్రిని అరెస్టు చేసినట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఇందాపూర్ తహసీల్‌లోని ఓ గ్రామంలో నాలుగు నెలల పిండాన్ని పొలంలో పూడ్చిపెట్టారు.
 
"మృతి చెందిన మహిళ 2017లో నిందితుడితో వివాహం చేసుకుంది. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. 2021లో ఆ మహిళకు మగబిడ్డ పుట్టాడు" అని పోలీసులు తెలిపారు. 
 
ఆ మహిళ మూడోసారి గర్భం దాల్చిందని పోలీసుల విచారణలో తెలిసింది. పిండం ఆడది అని ఆమె కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దీంతో భర్త, ఆమె తల్లిదండ్రులు ఇంట్లోనే వైద్యుడిని పిలిపించి, మహిళకు అబార్షన్ చేయించారు. 
 
ఆ సమయంలో ఆమె నాలుగు నెలల గర్భిణి. అయితే గర్భస్రావం చికిత్స వికటించి బాధితురాలు మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.