1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 మే 2025 (10:25 IST)

పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి 14 మంది మృతి

deadbody
పంజాబ్‌లో ఘోరం జరిగింది. కల్తీ మద్యం తాగి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పలువురు నిందితులు అదుపులోకి తీసుకున్నారు.
 
అధికారులు తెలిపిన వివరాల మేరకు.. అమృతసర్‌లోని మజితా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కల్తీ మద్యం తాగి పలువురు మృతి చెందారు. మరో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే చర్యలు తీసుకుని ప్రధాన నిందితుడైన ప్రబ్జీత్‌ సింగ్‌తో పాటు మరికొంతమందిని అరెస్టు చేశారు. విచారణ సమయంలో సహబ్ సింగ్ అనే మరో నిందితుడి పేరు వెల్లడైంది. 
 
అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడి నుంచి ఈ మద్యాన్ని తీసుకొచ్చారనే దానిపై విచారణ జరుపుతున్నారు. ఇదే మద్యం తాగిన మరికొంతమందిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. కల్తీ మద్యం తయారీదారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ కేసుపై రెండు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.