మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 డిశెంబరు 2021 (15:58 IST)

సిక్కుల పవిత్ర పతాకాన్ని అపవిత్రం చేశాడనీ.. వ్యక్తిని కొట్టి చంపేసారు...

పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. సిక్కుల పవిత్ర పతాకమైన నిషాన్ సాహిబ్‌ను అపవిత్రం చేశాడన్న అక్కసుతో ఓ వ్యక్తిని కొందరు సిక్కులు కొట్టి చంపేశారు. ఈ ఘటన ఆదివారం జరిగింది. 
 
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం అమృత్‌సర్‌ స్వర్ణదేవాలయంలో శనివారం రాత్రి ఓ వ్యక్తిని కొట్టి చంపిన విషయం తెల్సిందే. గర్భగుడిలోకి ప్రవేశించి బీభత్స సృష్టించినందుకు ఆ యువకుడిపై కొందరు సిక్కు భక్తులు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే పంజాబ్‌లో అదే తరహాలో ఘటన జరిగింది. 
 
పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలా జిల్లా నిజాంపూర్ గ్రామంలో ఓ గురుద్వారాలోకి ఓ వ్యక్తి ప్రవేశించి, సిక్కుల పవిత్ర జెండా నిషాన్ సాహిబ్‌ను అపవిత్రం చేస్తూ కొందరు సిక్కుల కంటపడ్డారు. ఇంతలో అక్కడకు వచ్చిన పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
కానీ, ఆ వ్యక్తిని తమ ఎదుటే విచారించాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు, గ్రామస్థుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆ యువకుడిపై గ్రామస్థులు దాడి చేయడంతో ఆ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. అమృతసర్‌లో ఓ ఘటన జరిగిన 24 గంటల్లోనే పంజాబ్‌లో ఇదే తరహా ఘటన జరగడం గమనార్హం.