రాహుల్ గాంధీకి శ్రీనగర్‌లో చుక్కెదురు.. రావొద్దని అడ్డుకున్నారు..?
కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ అధినేత రాహుల్ గాంధీకి శ్రీనగర్‌లో చుక్కెదురైంది. కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో 12 మంది సభ్యులతో కూడిన రాహుల్ గాంధీ బృందం పర్యటన చేపట్టింది. కానీ ప్రస్తుతం కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై పరిశీలించేందుకు రంగంలోకి దిగిన రాహుల్ బృందాన్ని అక్కడి అధికారులు అడ్డుకున్నారు.
రాజకీయ నేతలు కొంత కాలం పాటు కాశ్మీర్‌లో అడుగుపెట్టవద్దన్నారు. కాశ్మీర్ లోయలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, నేతల పర్యటనలతో ఆటంకం కలిగించొద్దని కాశ్మీర్ పౌర సంబంధాల శాఖ అధికారులు డిమాండ్ చేస్తున్నారు.
ఇంకా రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ కూడా శ్రీనగర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఇక వీరితో పాటు అఖిలపక్ష నేతలు కూడా వెంట వెళ్లనున్నారు. సీపీఎంకు చెందిన సీతారాం ఏచూరి, సీపీఐ నేత డి. రాజా, డీఎంకే నేత తిరుచి శివ, ఆర్జేడీ మనోజ్ ఝా, టీఎంసీ నేత దినేష్ త్రివేది కూడా శ్రీనగర్‌లో పర్యటించనున్నారు.