బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2024 (20:04 IST)

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు.. స్పందించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi
లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించడంతో ఇప్పుడు యావత్ భారతదేశం తిరుమల లడ్డూ అంశంపై చర్చనీయాంశమైంది. కేంద్ర పెద్దలు కూడా దీనిపైనే స్పందిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్పందించారు. ఈ వ్యవహారంపై ఎవరినీ నిందించలేమనీ, ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 
 
''తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. శ్రీవారికి దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది భక్తులున్నారు. ఈ సమస్య ప్రతి భక్తుడిని బాధపెడుతుంది. దీనిపై క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోని అధికారులు మన మతపరమైన ప్రదేశాల పవిత్రతను కాపాడాలి." అని రాహుల్ ట్వీట్ చేశారు.