శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 8 జూన్ 2019 (14:44 IST)

మీ కోసం నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి : రాహుల్ గాంధీ

కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం ప్రజల కోసం తన ఇంటి తలపులు ఎల్లవేళలా తెరిచి ఉంటాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆయన శనివారం వాయనాడ్ లోక్‌సభ పరిధిలోని కాల్పెట్టలో రోడ్‌షో నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, తనను రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికీ నా ఇంటి తలుపులు తెరిచివుంటాయి. పార్టీలు, సిద్ధాంతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ తాను అందుబాటులో ఉంటానని ఆయన ప్రకటించారు. 
 
కాగా, ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళ రాష్ట్రంలోని వాయనాడ్, అమెథీ స్థానాల నుంచి పోటీ చేశారు. ఇందులో వాయనాడ్ నుంచి గెలుపొందగా, అమేథీలో ఓడిపోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ గెలుపొంది కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.