ఘోర ప్రమాదం.. రెండు బస్సులు ఢీ..11మంది మృతి

ఎం| Last Updated: శనివారం, 23 నవంబరు 2019 (11:21 IST)
రాజస్థాన్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 11మంది ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగోర్ జిల్లాలోని కుచామన్ పట్టణ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. వేగంగా వచ్చిన రెండు మినీ బస్సులు ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.దీనిపై మరింత చదవండి :