భార్య నచ్చలేదని.. తన స్నేహితులకు అమ్మేశాడు..
భార్య నచ్చలేదని.. తన స్నేహితులకు అమ్మేశాడు.. ఓ భర్త. వారు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ కోట ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ కోటకు సమీపంలోని బుండి ప్రాంతానికి చెందిన బాధిత మహిళ తండ్రి ఈ నెల 3వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు.
తన కూతురు కనిపించడం లేదని మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు. తన కూతురిని విజయ్‌గఢ్ ప్రాంతానికి చెందిన రాకేష్‌కు ఇచ్చి వివాహం చేశానని, అతడే తన కూతురిని వేరే వారికి అమ్మేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం ఆమెను కనుగొన్నారు.
తన భర్త రాకేష్, వదిన ప్రియ తనను తరచుగా హింసించేవారని బాధితురాలు వాపోయింది. ఈ నెల మూడో తేదీన తనను ముగ్గురు వ్యక్తులకు అమ్మేశారని బాధిత మహిళ చెప్పింది. వారు తనను ఓ ఇంట్లో నిర్భంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్, ప్రియను అదుపు లోకి తీసుకున్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తుల గురించి గాలిస్తున్నారు.