బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 13 ఫిబ్రవరి 2021 (12:09 IST)

రాజ్యసభ మార్చి 8కి వాయిదా

పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో భాగమైన తొలి విడత భేటీలు రాజ్యసభలో శుక్రవారంతో ముగిశాయి. 2021-22 బడ్జెట్‌పై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానం ఇచ్చిన అనంతరం ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మార్చి 8వ తేదీకి వాయిదా వేశారు.

రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ఏప్రిల్‌ ఒకటో తేదీ వరకు కొనసాగుతాయి. కొవిడ్‌ నిబంధనల కారణంగా ఉభయ సభలు వేర్వేరు షిప్టుల్లో సమావేశమవుతున్న విషయం తెలిసిందే. రాజ్యసభ వాయిదా పడడంతో లోక్‌సభ శనివారం ఉదయం 10గంటలకే సమావేశమైంది.

ప్రస్తుత సమావేశాల్లో రాజ్యసభ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలను కొనసాగిస్తూ వచ్చాయి.