ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (13:15 IST)

కాశ్మీర్ బాలికపై మత్తుమందిచ్చి అత్యాచారం.. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్.. ఆపై?

కాశ్మీర్‌లో ఓ బాలిక నరకం అనుభవించింది. తనకు ఎదురైన ఘటనను చెప్పుకుని.. తనకు ఏర్పడిన దుర్గతి ఎవరికీ పట్టకూడదని ఆ దేవుడిని వేడుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? జనవరి 21వ తేదీన మైనర్ బాలికను దుండగులు కిడ్నాప

కాశ్మీర్‌లో ఓ బాలిక నరకం అనుభవించింది. తనకు ఎదురైన ఘటనను చెప్పుకుని.. తనకు ఏర్పడిన దుర్గతి ఎవరికీ పట్టకూడదని ఆ దేవుడిని వేడుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..? జనవరి 21వ తేదీన మైనర్ బాలికను దుండగులు కిడ్నాప్ చేశారు. ఆమెను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లి మత్తుమందులిచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వీడియోలు కూడా తీశారు. 
 
అంతటితో ఆగకుండా ఆ వీడియోలు చూపించి బ్లాక్‌ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఆ బాలిక కన్నీటి పర్యంతమైంది. కుల్గాం పోలీసులు ఆ బాలికను ముగ్గురు కామాంధుల చెర నుంచి కాపాడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితురాలి వద్ద వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇంకా ఆ ముగ్గురిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. 
 
మరోవైపు 8 ఏళ్ల ఆసిఫా బానో అనే మైనర్ బాలికపై దుండగులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని పోలీసులు కతువా జిల్లా ప్రాంతంలో కనుగొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.