బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 30 జులై 2020 (16:21 IST)

రాఫెల్ ను రఫ్ఫాడించిన భారత తొలి పైలట్లు వీరే

శత్రుదేశాలను తుత్తునీయలు చేసేందుకు ఫ్రాన్స్ నుంచి రాఫెల్ యుద్ధ విమానాలు మన దేశానికి చేరుకున్నాయి. 7,000 కిలోమీటర్లు ప్రయాణించి, అంబాలా వాయుసేన బేస్‌లో దిగాయి. అయితే తొలిగా వాటిని నడిపిన భారత పైలెట్లు ఎవరన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఆ వీరులెవరంటే...
 
హర్‌కిరత్ సింగ్ (గ్రూప్ కెప్టెన్) : ఈ బృందానికి ఈయనే నాయకత్వం వహించారు. అత్యున్నత పురస్కారమైన ‘శౌర్యచక్ర’ ఈయనను వరించింది. 2008 లో ఓ మిషన్ చేపట్టిన సందర్భంలో దురదృష్ట వశాత్తు ఆయన ఏయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికై గురైంది. ఆ సమయంలో ఆయన చాలా మంది ప్రాణాలను కాపాడారు. వీరి తండ్రి కూడా వాయుసేనలో లెఫ్టినెంట్ కల్నల్‌గా సేవలందించారు. 
 
అభిషేక్ త్రిపాఠి (వింగ్ కమాండర్) : స్వస్థలం రాజస్థాన్. విద్యార్థిగా ఉన్నప్పుడు మల్లయోధుడు. చిన్నతనం నుంచే మంచి క్రీడాకారుడు. వీరి తండ్రి బ్యాంకు ఉద్యోగి. తల్లి ఐటీ విభాగంలో సేవలందించారు. 
 
మనీశ్ సింగ్ (వింగ్ కమాండర్) : యూపీలోని బక్వా అన్న చిన్న గ్రామం నుంచి వచ్చారు. వీరి కుటుంబంలో చాలా మంది వాయుసేనలో సేవలందించారు. ఆ పరంపరనే ఈయన కొనసాగిస్తున్నారు. సైనిక్ స్కూల్‌లో విద్యనభ్యసించిన వీరు... 2003లో వైమానిక దళంలో చేరారు. 
 
రోహిత్ కఠారియా (గ్రూప్ కెప్టెన్) : ఈయన స్వస్థలం హర్యానా. వీరి తండ్రి ఆర్మీ అధికారి. కల్నల్ గా పదవీ విరమణ పొందిన వీరి తండ్రి... సైనిక్ స్కూలుకు ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. మనీశ్ సింగ్‌ను ఊళ్లో చాలా మంది రోల్ మోడల్ గా భావిస్తున్నారు.