మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (13:10 IST)

వాటిని మానవహత్యలుగానే పరిగణించాలి : రతన్ టాటా

కేరళ రాష్ట్రంలో గర్భంతో ఉన్న ఓ ఏనుగుకు టపాకాయలు ఉన్న పైనాపిల్ తినిపించి చంపిన ఘటనపై ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తీవ్రదిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. దీన్ని జంతుహత్యగా కాకుండా మానవహత్యగా పరిగణించాలని ఆయన కోరారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
కేరళ రాష్ట్రంలోని మలప్పురంలో ఓ ఏనుగుకు టపాసులు ఉన్న పైనాపిల్ కాయ తినిపించి చంపేశారు. పైగా, ఈ ఏనుగు నిండు గర్భిణి. దీంతో ఏనుగుతో పాటు దాని కడుపులోని ఏనుగు పిల్ల కూడా చనిపోయింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. 
 
అలాగే, రతన్ టాటా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ట్విట్టర్ వేదికగా స్పందించారు. జంతువులపై జరుగుతున్న ఇటువంటి దారుణాలను మానవ హత్యలుగానే పరిగణించాలని ఆయన కోరారు. 
 
'కొందరు వ్యక్తులు పటాసులు నింపిన పైనాపిల్‌ ఆశపెట్టి అమాయకమైన ఓ ఏనుగును చంపిన ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, కలవరపాటుకు గురిచేసింది. అమాయక జంతువులపై ఇటువంటి నేరపూరిత చర్యలకు, సాటి మనుషుల హత్యలకు తేడా ఏమీ లేదు. చనిపోయిన ఏనుగుకు న్యాయం జరగాలి' అంటూ రతన్ టాటా తన పోస్టులో కోరారు.