1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 మార్చి 2022 (22:37 IST)

రేషన్ ఆధార్ కార్డ్ లింక్ : జూన్ 30 వరకు పొడిగింపు

2022 సంవత్సరం మార్చి 31వ తేదీ రేషన్ కార్డుకు ఆధార్ కార్డులను లింక్ చేసుకోవడానికి చివరి తేదీ కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ గడువును పొడిగించింది.

2022 సంవత్సరం జూన్ 30వ తేదీ రేషన్ కార్డులను ఆధార్ కార్డులను దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది. ఇప్పటివరకు రేషన్ కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసుకోని వాళ్లు వెంటనే లింక్ చేసుకుంటే మంచిది
 
ఇకపోతే.. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలని అనుకుంటే రేషన్ కార్డుకు ఆధార్ కార్డులను లింక్ చేసుకోవాలి. 
 
వలస కూలీలకు, కార్మికులకు ఈ స్కీమ్ వల్ల భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది. రేషన్ కార్డులో వేర్వేరు రకాలు ఉండగా అర్హతల ఆధారంగా రేషన్ కార్డులో వేర్వేరు రకాలు ఉంటాయి.
 
రేషన్ కార్డును బట్టి పొందే ప్రయోజనాల విషయంలో కూడా మార్పులు ఉంటాయి. రేషన్ కార్డును కలిగి ఉన్నవాళ్లు తప్పనిసరిగా ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోంది.