బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 25 నవంబరు 2020 (06:09 IST)

చెన్నైకి మళ్లీ ఆర్టీసీ సర్వీసులు

8 నెలల తర్వాత బుధవారం మళ్లీ ఎపి నుంచి చెన్నైకి ఆర్‌టిసి బస్సుల సర్వీసులు ప్రారంభం  అయ్యాయి. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతినిచ్చినా.. ఎపిలో మాత్రం ఇప్పుడిప్పుడే బస్సులు పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నాయి.

కొన్నిరోజుల కిందట తెలంగాణకు బస్సులు పున్ణ ప్రారంభించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రేపటి నుంచి చెన్నైకి కూడా బస్సులు తిప్పేందుకు సన్నద్ధమైంది.

విజయవాడతోపాటు తిరుపతి, గూడూరు, తదితర ప్రాంతాల నుంచి తమిళనాడుకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.

చెన్నై ప్రయాణం కోసం ఎపిఎస్‌ ఆర్టీసీ ఆన్‌లైన్‌ లోనూ టికెట్లు ఉంచింది. రాబోయే రోజుల్లో డిమాండ్‌ కు అనుగుణంగా చెన్నైకి మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులు భావిస్తున్నారు.