శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 9 ఫిబ్రవరి 2019 (08:42 IST)

మోదీ ప్రజల అకౌంట్లో డబ్బులు జమచేస్తున్నారట.. పోస్టాఫీసుకు పరుగులు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు ప్రజలను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తోంది. మోదీ సర్కారు ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.25 వేల నుంచి రూ.15లక్షల వరకు జమ చేస్తుందని ప్రచారం జరగడంతో పోస్టాఫీసుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు ప్రజలు. అవన్నీ వదంతులేనని.. వాటిని పట్టించుకోవద్దునని చెప్పినా.. వినిపించుకోవట్లేదు. 
 
ఈ ఘటన బీహార్‌లోని మోతీహారి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామస్థులు పోస్టాఫీసుకు పరుగులు తీశారు. ఖాతాలు తెరిచేందుకు పోటీలు పడ్డారు. పోస్టాఫీసు వద్ద క్యూ కట్టడంతో ఆ ప్రాంతం జాతరలా కనిపించింది. మహిళలు, పురుషులకు ప్రత్యేక క్యూలు వున్నాయి. ఈ క్యూల్లో ప్రజలు గంటల కొద్దీ నిలబడి.. ఖాతాలు తెరిచారు. కాగా ప్రధాని మోదీ అకౌంట్లలో డబ్బులు జమచేస్తున్నారనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పినా ప్రజలు పట్టించుకోలేదు.