గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2020 (10:19 IST)

శబరిమల ఆలయం తెరుచుకున్నా.. రోజుకు ఐదువేల మందికే అనుమతి

శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోనుంది. మకర జ్యోతి పూజల కోసం అయ్యప్ప ఆలయాన్ని అధికారులు తెరిచారు. బుధవారం సాయంత్రం ప్రత్యేక పూజలు చేసిన ఆలయ పూజారులు.. గురువారం ఉదయం నుంచి భక్తులను అనుమతించనున్నారు. ఈ మేరకు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. అయితే గతంలో మాదిరిగా రోజుకు వేల సంఖ్యలో భక్తులను అనుమతించడం కుదరదని.. కరోనా కారణంగా రోజుకు కేవలం 5వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
 
అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేసింది. మకరజ్యోతి పూజల్లో భాగంగా జనవరి 20 వరకు ఆలయం తెరిచే ఉంటుంది. జనవరి 14 మకరజ్యోతి దర్శనం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.