మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (10:56 IST)

సిగరెట్లకు యేటా 3.5 లక్షల మంది మృతి.. అందుకే నిషేధం!?

cigarettes
మన దేశంలో సిగరెట్ల కారణంగా ప్రతి యేటా 3.5 లక్షల మంది చనిపోతున్నారు. దీనిపై కేంద్రం సీరియస్‌గా దృష్టిసారించింది. అందుకే పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు మేరకు సిగరెట్ల చిల్లర అమ్మకాలపై నిషేధం విధించాలన్న యోచనలో ఉంది. 
 
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సిగరెట్లను లూజుగా (చిల్లర) విక్రయించడాన్ని నిషేధించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. దీనిపై కేంద్రం సీరియస్‌గా ఆలోచన చేస్తుంది. 
 
సిగరెట్లను లూజుగా విక్రయిస్తుండటంతో పొగాకు వినియోగం ఏమాత్రం తగ్గడం లేదు. పైగా పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా దేశంలో ప్రతి సంవత్సరం 3.5 లక్షల మంది మరణించినట్టు తెలిపింది. పొగాగు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు పన్నులు పెంచుతున్నప్పటీ ఆశించిన ఫలితం రావడం లేదు. 
 
దీంతో సిగరెట్ల చిల్లర విక్రయాలపై నిషేధం విధించాలని కేంద్రం భావిస్తుంది. దీనికి సంబంధించి వచ్చే బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఓ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.