గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 డిశెంబరు 2022 (17:27 IST)

కట్టుకున్న భార్యను స్నేహితులతో పడక పంచుకోవాలన్నాడు..

romance
కట్టుకున్న భార్యను స్నేహితులతో పడక పంచుకోవాలని బలవంతం చేసిన కీచక భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు సంపిగేహళ్లికి చెందిన ఒక మహిళ (34)కు 2011లో ఓ వ్యక్తితో వివాహం అయ్యింది. వీళ్లిద్దరూ టెక్కీలే. వీరికి ఒక కుమారుడు వున్నారు. వీరి సంసార జీవితం సాఫీగానే సాగుతోంది. ఆ తర్వాత భర్త డ్రగ్సుకు అలవాటు పడ్డాడు. అప్పుల్లో కూరుకుపోయాడు. 
 
ఈ క్రమంలోనే స్నేహితులతో శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో దాడికి పాల్పడ్డాడు. ఆపై అతడి దెబ్బలు భరించలేక ఆమె ఒప్పుకుంది. అతడి ఇద్దరి స్నేహితులతో శృంగారంలో పాల్గొంది. దీనిని అతడు వీడియో తీసి పదే పదే తన స్నేహితులకు పడకసుఖం ఇవ్వాలని బలవంతం చేశాడు.
 
రోజురోజుకీ వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ అతడు మాత్రం ఆ శృంగార వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశాడు. గంజాయికి అలవాటు పడ్డ తన భర్త, ఇంట్లోనే రెండు మొక్కలు పెంచాడని కూడా తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అతడిని అరెస్ట్ చేశారు.