శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 16 నవంబరు 2019 (08:30 IST)

దేశమంతా ఒకేరోజు వేతనం

ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు, ఒకే దేశం ఒకే రేషన్ కార్డు మొదలైన ప్రయోగాలు చేయాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో కొత్త ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ చెప్పారు.

ఆ కొత్త ఆలోచన పేరే ఒకే దేశం ఒకేరోజు వేతనాలు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇది అమలు చేస్తే దేశ వ్యాప్తంగా ఉద్యోగులకు, కార్మికులకు ఒక్క రోజే వేతనాలు, జీతాలు అందుతాయి.

ఒకే దేశం ఒకే రోజు జీతాలు అనే చట్టం త్వరలోనే వస్తుందని, ప్రధాని మోడీ ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న కార్మిక సంస్కరణల్లో ఇదొక భాగమన్నారు.