సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (14:55 IST)

జనతా కర్ఫ్యూకు సహకరించాలి.. సెలెబ్రిటీల మద్దతు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 22వ తేదీన జనతా కర్ఫ్యూ నిర్వహించాలని పిలుపు నిచ్చారు. దీనికి దేశ ప్రజలంతా కలిసి ముందుకు రావాలని, ప్రతి ఒక్కరు ఇందుకు సహకరించాలని, భారత ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా అన్నారు. అత్యంత ప్రమాదకరమైన వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పటికీ ప్రజలంతా క్షేమంగా ఉండాలని సేవ చేస్తున్న వైద్య సిబ్బందికి అందరు సంఘీభావం తెలపాలని ట్విట్ చేశారు.
 
మరోవైపు ప్రధాని జనతా కర్ఫ్యూకు సినీ సెలెబ్రిటీలు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో మెగాస్టార్ కూడా జనతా కర్ఫ్యూకు మద్దతిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వచ్ఛందంగా 'జనతా కర్ఫ్యూ'ను పాటిద్దామని చిరంజీవి అన్నారు.
 
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి 24 గంటలు పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర బృందాలు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ, వివిధ విభాగాల ప్రభుత్వ అధికారులను ప్రశంసించాల్సిన సమయమిదని కొనియాడారు.