సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (15:54 IST)

ముస్లిం బాలికల జననాంగ ఛేదనపై పిల్..

ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందగానే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి రానుంది. పార్లమెంట్‌లో

ట్రిపుల్ తలాక్ శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందగానే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి రానుంది. పార్లమెంట్‌లో ఈ బిల్లు గట్టెక్కకపోవడంతో.. కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ముస్లిం మహిళల హక్కులను కాపాడటం కోసం ఈ ఆర్డినెన్స్ సహకరించనుంది. 
 
ఈ నేపథ్యంలో ముస్లింలలోని కొన్ని వర్గాల్లో బాలికల జననాంగ ఛేదనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను రాజ్యాంగ ధర్మాసనానికి సుప్రీం కోర్టు బదిలీ చేసింది. ఈ ఛేదన చర్య బాల హక్కులను హరించడమేనని ఓ న్యాయవాది పిల్ వేశారు. 
 
ఈ వాదనతో గతంలో కోర్టూ ఏకీభవించగా దీని చెల్లుబాటుపై లోతైన అధ్యయనం చేయాలని దావూదీ బోహ్ర వర్గ ముస్లింలు తెలిపారు. దీంతో  పరిశీలించాలని రాజ్యాంగ ధర్మాసనానికి సీజేఐ దీపక్ మిశ్రాతో కూడిన బెంచ్ సోమవారం పేర్కొంది.