మాంసం తిన్నారనీ విద్యార్థుల తలలు పగులగొట్టిన ఏబీవీపీ కార్యకర్తలు
ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య నిత్యం ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్యాంపస్‌లో విద్యార్థులు రెండు వర్గాలుగా చీలిపోయి గొడవలకు దిగుతున్నారు. తాజాగా శ్రీరామ నవమి పండుగ రోజున ఈ వర్శిటీలోని కావేరీ హాస్టల్‌లో మాంసం వడ్డించారు.
ఈ పండుగ ఆదివారం రోజే వచ్చింది. అయితే, హాస్టల్ సిబ్బంది మాత్రం రోజువారీ మెనూ ప్రకారం మాంసం వడ్డించారు. దీంతో ఆగ్రహించిన ఏబీవీపీ కార్యక్తలు మాంసాహారాన్ని ఆరంగించిన విద్యార్థులపై దాడి చేసింది. ఈ దాడిలో పలువురు విద్యార్థుల తలలు పగిలాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు, ఏబీవీపీ విద్యార్థులు ప్రత్యారోపణలు చేస్తున్నారు. క్యాంపస్‌లో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకలకు జేఎన్ఎస్‌యూ కార్యకర్తలు అడ్డు తగిలారని, దీంతో ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగినట్టు పేర్కొన్నారు. పరస్పర దాడుల్లో విద్యార్థులకు పెద్ద సంఖ్యలో గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దాయి.