1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (11:09 IST)

బుకారెస్ట్ నుంచి ఢిల్లీ చేరిన రెండో విమానం - సురక్షితంగా తెలుగు విద్యార్థులు

ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతుంది. దీంతో ఈ దేశంలోని పలు దేశాల ప్రజలు చిక్కుకునిపోయారు. ఇలాంటివారిలో భారతీయ పౌరులు, విద్యార్థులు కూడా ఉన్నారు. వీరందరిని కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి తరలిస్తుంది. ఇందులోభాగంగా, శనివారం రాత్రి రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి బయలుదేరిన తొలి విమానం ముంబైకు చేరుకుంది. ఆదివారం మరో 250 మంది భారతీయ పౌరులతో రెండో విమానం ఢిల్లీకి వచ్చి చేరింది. 
 
ఉక్రెయిన్ దేశ సరిహద్దుల్లో ఉన్న రొమేనియా నుంచి వీరిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చారు. ఢిల్లీకి చేరుకున్న భారతీయులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖామంత్రి జ్యోతిరాదిత్య సింధియా, భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్‌ను స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య మాట్లాడుతూ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని నరేంద్ర మోడీ టచ్‌లో ఉన్నారని, ప్రతి భారతీయ పౌరుడుని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. 
 
కాగా, ఢిల్లీకి వచ్చిన ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు రాజులపాటి అనూష, సిమ్మ కోహిమ, వైశాలి. వేముల వంశీ కుమార్, అభిషేక్ మంత్రి, జయశ్రీ. హర్షిత కౌసరా, సూర్య సాయి కిరణ్ ఉన్నారు. అలాగే, తెలంగాణాకు చెందిన విద్యార్థుల్లో వివేక్, శ్రీహరి, తరుణ్, నిదిష్, లలితా, దేవి, దివ్య, మనీషా, రమ్య, ఐశ్వర్య, మాన్య, మహిత, గీతిక, లలిత, తరణి ఉన్నారు. వీరిని ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్‌లు రిసీవ్ చేసుకుని వారివారి స్వస్థలాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.