మంగళవారం, 18 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (11:58 IST)

ఎన్.ఐ.ఏ చీఫ్‌గా దినకర్ గుప్తా - హోం శాఖ ఉత్తర్వులు

Dinakaran gupta
Dinakaran gupta
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) కొత్త అధిపతిగా సీనియర్ ఐఏఎస్ అధికారి దినకర్ గుప్తాను కేంద్ర హోం మంత్రిత్వ వ్యవహారాల శాఖ నియమించింది. ఈయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. అలాగే, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా స్వాగత్ దాస్‍‌ను నియమిచింది. ఈ మేరకు కేంద్ర కేబినట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీచేసింది. 
 
పంజాబ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్‌కు చెందిన దినకర్ గుప్తా వచ్చే 2024 మార్చి 31వ తేదీ వరకు లేదా ఆయన పదవీ విరణ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగుతారు. అదేవిధంగా చత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1987 ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ స్వాగత్‌ దాస్‌ను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. ఈయన 2024 నవంబరు30వ తేదీ వరకు లేదా ఆయన రిటైర్మెంట్ వరకు పదవిలో కొనసాగుతారు.