మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఆగస్టు 2020 (08:50 IST)

సల్మాన్ హత్యకు కుట్ర : 2 నెలలుగా రెక్కీ.. షార్ప్ షూటర్ అరెస్టు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హత్యకు ఓ పెద్ద కుట్రే జరిగింది. గత రెండు నెలలుగా ఆయన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఈ విషయాన్ని పసిగట్టిన సల్మాన్‌తో పాటు.. ముంబై పోలీసులు ఆయన నివాసం వద్ద ఓ షార్ప్ షూటర్‌ను అరెస్టు చేశారు. ఈ నిందితుడు బిష్ణోయ్ ముఠాకు చెందిన సభ్యుడిగా పోలీసులు గుర్తించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫరీదాబాద్‌కు చెందిన రాహుల్ అలియాస్ సంగా అలియాస్ బాబా అలియాస్ సున్నీ (27) అనే వ్యక్తి గత జూన్ 24వ తేదీన రేషన్ డిపో నడుపుతున్న ఫరీదాబాద్ నివాసి ప్రవీణ్‌ను హత్య చేశాడు. ఈ కేసులో రాహుల్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేశారు. 
 
ఈ విచారణలో తాను హీరో స‌ల్మాన్ ఖాన్‌ను హ‌త్య చేసేందుకు రెక్కీ నిర్వ‌హించిన‌ట్లు చెప్పాడు. హ‌త్య విష‌యంలో నిందితుడి బాంద్రాలోని స‌ల్మాన్ ఖాన్ ఇంటి వ‌ద్ద రెండు రోజుల పాటు రెక్కీ నిర్వ‌హించిన‌ట్లు డీసీపీ రాజేష్ దుగ్గల్ వెల్ల‌డించారు.
 
కృష్ణ జింక‌ల్ని వేటాడిన కేసులో స‌ల్మాన్ ఖాన్ నిందితుడు. అయితే బిష్ణోయ్ వ‌ర్గానికి చెందిన వారు జింక‌ల్ని ఆరాధిస్తారు. దీంతో అదే వ‌ర్గానికి చెందిన లారెన్స్ బిష్ణోయ్.. సల్మాన్ ఖాన్‌పై కోపం పెంచుకుని, సల్మాన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. సల్మాన్ ఖాన్ హత్యకు జోధ్‌పూర్ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్.. తనకు సుపారీ ఇచ్చారని రాహుల్ అంగీకరించారు.