గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 జులై 2023 (23:14 IST)

చొక్కా లోపల పాము వీడియో: గుండీలు ఒక్కొక్కటీ తీసేసరికి..? (వీడియో)

Snake In Shirt
Snake In Shirt
పామును చూస్తే ఆమడ దూరం పరిగెడతాం. అదే మనిషి చొక్కాలోకి ప్రవేశిస్తే ఇంకేమైనా వుందా.. అంతే సంగతులు మనిషి చచ్చి బతికినట్లే అవుతుంది. తాజాగా ఓ పాము ఓ వ్యక్తి షర్టులోకి ప్రవేశించిన వీడియో నెటిజన్లకే వెణుకు పుట్టించింది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియో ఒక వ్యక్తి చొక్కా లోపల పెద్ద నాగుపామును చూపిస్తుంది. 
 
ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోలో మరొక వ్యక్తి పామును చొక్కా నుండి జాగ్రత్తగా బయటకు తీయడానికి సహాయం చేస్తున్నాడు. ఇటీవల ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న వీడియోలో పెద్ద నాగుపాము కనిపించింది. షర్ట్ గుండీలు ఒక్కొక్కటీ తీసేయడంతో ఆ పాము ఆ వ్యక్తిని ఏమీ చేయకుండా మెల్లగా బయటపడింది. 
 
 

 
ఈ వీడియోను చూసినవారంతా వామ్మో ఏమైపోతాడో అంటూ జడుసుకున్నారు. చివరికి ఆ వ్యక్తి చొక్కా నుంచి పాము బయటపడటంతో గుండీలేసుకుంటూ కనిపించాడు. సదరు వ్యక్తి మద్యం తాగి చెట్టు కింద పడుకోవడంతో ఆ పాము అతడి చొక్కాలోకి వెళ్లి వుంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు. తప్పతాగి ఎక్కడ పడితే అక్కడ పడుకుంటే ఇలాగే అవుతుంది.