సోమవారం, 4 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 అక్టోబరు 2024 (22:39 IST)

కన్నూరు డిప్యూటీ కలెక్టర్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

Naveen Babu
Naveen Babu
కన్నూరు డిప్యూటీ కలెక్టర్‌, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ నవీన్‌బాబు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన నివాసంలో ఉరి వేసుకుని కనిపించారు. సోమవారం తన వీడ్కోలు కార్యక్రమంలో జరిగిన సంఘటనతో నవీన్‌బాబు తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. పెట్రోల్ పంపు కోసం ఎన్‌ఓసి విషయంలో నవీన్ బాబు లంచం తీసుకున్నారని కన్నూరు జిల్లా పంచాయతీ అధ్యక్షురాలు పి.పి.దివ్య ఆరోపించారు. 
 
పెట్రోల్ పంపు కోసం ఎన్‌ఓసి కోరిన సిపిఎం మద్దతుదారుడు ప్రశాంత్ చేసిన ఆరోపణను ఆమె పరోక్షంగా ప్రస్తావించారు. ఏడీఎంకు లంచం ఇచ్చిన తర్వాతే అక్టోబర్ 9న ఎన్‌ఓసీ పొందారని ఆరోపించారు. ఈ ఆరోపణలు ఎడిఎం, కలెక్టర్, ఇతర సిబ్బంది ఎదుట చేయడంతో.. అవమానకరంగా భావించిన నవీన్ బాబు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన అధికార నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.