శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జూన్ 2024 (15:52 IST)

రెమాల్ తుపాను ఎఫెక్ట్.. ముందుగానే నైరుతి రుతుపవనాలు

Rains
కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు అనుకున్న తేదీ కంటే ముందుగానే రానున్నాయి. రుతుపవనాల ఆగమనం సమయంలోనే బంగాళాఖాతంలో రెమాల్ తుపాను ఏర్పడడంతో వాటి గమనాన్ని ఇది బలంగా లాగిందని, అందుకనే అనుకున్న సమయానికి ముందుగానే అవి ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంటాయని వాతావరణశాఖ పేర్కొంది.
 
త్రిపుర, మేఘాలయ, అస్సాం, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోకి ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించాయి. లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు సహా ఇతర ప్రాంతాల్లోకి కూడా ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. 
 
సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయి. జూన్ 5 నాటికి అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్, అస్సాం రాష్ట్రాలకు చేరుకుంటాయి.