గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 జులై 2022 (12:15 IST)

నీట్ పరీక్ష.. లో-దుస్తులను విప్పించి.. పరీక్షా గదికి..?

neet exam
దేశ వ్యాప్తంగా జులై 17న నీట్ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఓ వైపు పరీక్ష సమయం దగ్గర పడుతుంటే, మరోవైపు అవమానకరంగా వందమంది అమ్మాయిల లో-దుస్తులను విప్పించి, పరీక్ష గదికి పంపించారు. దాంతో పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిలు అవమానం తట్టుకోలేక కన్నీరు మున్నీరు అయ్యారు. 
 
పరీక్ష అనంతరం వారికి జరిగిన అవమానాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడంతో.. కోపంతో రగిలిపోయిన తల్లిదండ్రులు సదరు కాలేజీ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
వివరాలోకి వెళ్తే.. కేరళలోని కొల్లాంలో నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిల పట్ల అక్కడి సిబ్బంది అవమానకరంగా ప్రవర్తించారు. కొల్లాంలోని మార్థోమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనూ అధికారులు నీట్ పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. 
 
అయితే, పరీక్ష రాసేందుకు వచ్చిన అమ్మాయిలను అక్కడి సిబ్బంది నిశితంగా తనిఖీలు చేశారు. దాదాపు 100 మంది అమ్మాయిలను లోదుస్తులతో పరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు.
 
కానీ, లోదుస్తులకు సంబంధించి అక్కడి సిబ్బంది అభ్యంతరం చెప్పడంతో, తీవ్ర అవమానకర పరిస్థితుల్లో ఆ అమ్మాయిలు తమ లోదుస్తులు విప్పేసి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. 
 
పరీక్ష ముగిసిన తర్వాత తమకు జరిగిన అవమానాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు కాలేజీ యాజమాన్యంపై భగ్గుమన్నారు. కాలేజీ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.