మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 11 జూన్ 2024 (20:00 IST)

నాసిక్‌లో కూలిపోయిన సుఖోయ్ యుద్ధ విమానం: తప్పించుకున్న పైలెట్స్ (video)

Sukhoi fighter jet crashes
మహారాష్ట్రలోని నాసిక్‌లో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం కూలిపోయింది. ఈ విమానం కూలిపోతుందనగా విమానం నడుపుతున్న పైలట్, కో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.
 
పెద్ద శబ్దం చేస్తూ నాసిక్ పొలాల్లో విమానం నేలకూలడాన్ని చూసిన స్థానిక ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈలోపుగా విమానం కూలిన ఘటనా స్థలానికి కొద్దిదూరంలో పైలట్-కోపైలట్ సురక్షితంగా వుండటాన్ని చూసారు. కాగా విమానం కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి వుంది.